హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉబర్‌లో అద్దెకు ఆటోలు..
ప్రయాణీకులకు ఉబర్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ఒకే రోజు వివిధ ప్రదేశాలకు ప్రయాణించాలనుకునే వారి కోసం కొత్తగా 'అద్దెకు ఆటో' ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రయాణీకులకు ఉబర్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ఒకే రోజు వివిధ ప్రదేశాలకు ప్రయాణించాలనుకునే వారి కోసం కొత్తగా ‘అద్దెకు ఆటో’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉబర్ సంస్థ గతంలో కార్లకు అద్దెకు ఇచ్చే ఆప్షన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా ‘అద్దెకు ఆటో’ సేవలను కూడా ప్రారంభించింది. సదరు ప్రయాణీకుడు అద్దెకు తీసుకున్న ఆటోలను ఇష్టమైనన్ని సార్లు, ఇష్టమైనన్ని చోట్లు నిలుపుకోవచ్చు. ఇక ఆటోను గరిష్టంగా 8 గంటల పాటు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే బెంగళూరులో ప్రయోగాత్మకంగా చేపట్టింది. అక్కడ సక్సెస్ కావడంతో మెట్రో సిటీలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణేలలో దీన్ని బుధవారం లాంచ్ చేసింది. గంటకు రూ. 169 నుంచి ‘అద్దెకు ఆటో’ సేవలు లభించనున్నాయి. కాగా, ఈ ఆప్షన్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని.. దాని వల్ల డ్రైవర్లకు కూడా లబ్ది చేకూరుతుందని ఉబర్ సంస్థ వెల్లడించింది.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!
గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..