AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Party MLAs: గులాబీ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు

టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం ఆధిపత్యం కోసం అంతర్గతంగా పోరాడుతున్నారు. సహకార ఎన్నికలు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని కల్పించినట్లు సమాచారం.

TRS Party MLAs: గులాబీ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 26, 2020 | 7:08 PM

Two TRS MLAs fighting for upper hand: వాళ్లిద్దరూ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు. నిన్న మొన్నటివరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ పాటలు పాడుకున్నారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఒకరి పేరు చెబితేనే మరొకరు ఒంటిక కాలితో లేచే పరిస్థితి వచ్చిందట. సొసైటీ ఎన్నికలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పూడ్చలేనంత గ్యాప్‌ తెచ్చిందట.

ఇదీ చదవండి: బీజేపీతో బ్రేకప్‌కు డెడ్‌లైన్.. స్పెషల్ డే మార్చి 13

జీవన్‌రెడ్డి వర్సెస్‌ గణేష్ బిగాల.. ఇదిప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్. వీరిద్దరి మధ్య తీవ్రమవుతున్న కోల్డ్ వార్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద దుమారం రేపుతోంది. పక్క పక్క నియోజకవర్గాలు.. అందునా ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు. సో..నిన్నటి వరకూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మంచి మిత్రులు. ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారట.

ఇదీ చదవండి: తాగునీటి కొరత నివారణకు కొత్త ప్లాన్

ఈ ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిన అంశం ఏంటి? అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల సొంతూరు మాక్లూరు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఈ ఊరు ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్‌ గుప్తా…. తన తండ్రి కృష్ణమూర్తిని డీసీసీబీ ఛైర్మన్‌ చేయాలని అనుకున్నారట. మాక్లూర్‌ సొసైటీ ఛైర్మన్‌గా తన తండ్రి ఎన్నిక ఏకగ్రీవం అనుకునే టైమ్‌లోనే లోకల్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చక్రం తిప్పారట. తన అనుచరులకు సొసైటీ ఛైర్మన్‌ ఇప్పించుకుని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తాకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి షాక్ ఇచ్చారట.

ఇదీ చదవండి: జీవో 107పై మడతపేచీ.. రేపట్నించి టీడీపీ ప్లాన్ ఇదే

గణేష్‌ గుప్తా తండ్రి ఛైర్మన్‌ పదవి కోసం జీవన్‌రెడ్డితో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ కూడా రాయబారం నడిపారట. అయితే ఎమ్మెల్యే జోక్యాన్ని కూడా జీవన్‌రెడ్డి పట్టించుకోలేదట. తన నియోజకవర్గంలో అర్బన్‌ ఎమ్మెల్యే ఆధిపత్యం పెరగొద్దనే ఉద్దేశంతోనే ఆర్మూర్ ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: ట్రంప్ డిన్నర్‌కు జగన్‌ని ఎందుకుపిలవలేదో చెప్పేసిన బొత్స

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి.. తన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఎప్పుడూ గొడవలేనట. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో కోల్డ్‌వార్‌ ఓ పక్క నడుస్తుంటే.. అటు రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కూడా సంబంంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయట. క్లోజ్‌గా ఉన్న గణేష్‌ బిగాలతో కూడా విభేదాలు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదీ చదవండి: టీ.బీజేపీ నేతల్లో కొత్త మీమాంస… మిత్రుడా? ప్రత్యర్థా??