Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

Botsa comment: ట్రంప్ డిన్నర్‌కు జగన్‌ని ఎందుకు పిలవలేదో చెప్పేసిన బొత్స

ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు ఆహ్వానం అందలేదు? ఇదిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. అయితే.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అందుకు కారణమేంటో చెప్పేశారు..
botsa reasoning on president invitation, Botsa comment: ట్రంప్ డిన్నర్‌కు జగన్‌ని ఎందుకు పిలవలేదో చెప్పేసిన బొత్స

Botsa reveals secret behind no invitation for CM Jagan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించడం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పిలుపు రాకపోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. బీజేపీ జాతీయ నాయకత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలో ఇదంతా భాగమని కొందరు చెప్పుకుంటుంటే.. జగన్‌పై కేసులున్న కారణంగానే ఆయనకు పిలుపు రాలేదని మరికొందరు ప్రచారం చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం

కేసీఆర్ బీజేపీతో పలు దఫాలుగా విభేదిస్తున్నారు.. బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తున్న సీఏఏ వంటి అంశాలలోను కేంద్రంపై పోరాట ధోరణితోనే ఆయన కొనసాగుతున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం కేంద్రంతో సయోధ్యతో ముందుకు సాగుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోదీతోపాటు అమిత్‌షాను కలిసి వచ్చారు. కానీ.. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందుకు జగన్‌ను ఆహ్వానించకుండా… రాజకీయంగా విభేదిస్తున్న కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.

ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్

దాంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ మొదలైంది. జగన్‌ని ఎందుకు పిలవలేదు.. కేసీఆర్‌ను ఎందుకు పిలిచారు.. ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో జగన్‌కు పిలుపు రాకపోవడం వెనుక రీజన్‌ను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో వెల్లడించారు. జగన్ దేశంలోనే అత్యంత బలమైన నేత కాబట్టే రాష్ట్రపతిభవన్‌ ఆయనను ఆహ్వానితుల జాబితాలో చేర్చలేదనేది బొత్స ఇస్తున్న రీజనింగ్. వాహ్.. అదిరింది కదా బొత్స గారి ఉవాచ?

ఇదీ చదవండి: రెండు లారీల మధ్య ఇరుక్కున్న బతికిపోయిన లక్కీ ఫెల్లో

Related Tags