Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 38 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 138845. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 77103. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 57721. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4021. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: చ౦ద్రబాబు విశాఖ పర్యటన రద్దు . విశాఖ విమానాశ్రయంకి రేపు వచ్చిపోయే విమానాలు రద్దు కావటంతో రద్దయిన చ౦ద్రబాబు పర్యటన. పోలీసు అనుమతి లభించినప్పటికి విమానాల రద్దుతో విశాఖ ప్రయాణం రద్దు.
  • నేటి నుండి ప్రారంభమైన విమాన సర్వీసులు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న ప్రయాణికులు. 5.గంటలకు హైదరాబాద్ నుండి లక్నో వెళ్లిన మొదటి ఇండిగో ప్లైట్. 8 గంటలకు ముంబై నుండి హైదరాబాద్ కు రానున్న స్పెస్ జట్. అనేక క్యాన్సిలేషన్స్ జరగటం తో విమానాలను కుదించిన విమానయాన శాఖ. హైదరాబాద్ నుండి 100 విమానాలు తిరగవలసి ఉండగా 40 కి కుదించిన సర్వీసులు. ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే ఎయిర్పోర్ట్ లోకి అనుమతి. ఖచ్చితమైన ఆరోగ్య వివరాలు సమాచారం ఇవ్వాలని ఆదేశం.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • వాట్సప్ ద్వారా అసభ్యకర మెసేజీలు పంపుతున్నాడు అని ట్రాఫిక్ హోంగార్డు పై షీ టీమ్ కు ఫిర్యాదు చేసిన మహిళా డాక్టర్. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు లాక్‌డౌన్‌ సమయములో ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ . కొద్దిరోజుల తర్వాత వాయిస్ మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టిన హోంగార్డ్ వెంకటేష్ . వేధింపులు తట్టుకోలేక మహిళ డాక్టర్ షీ టీం పోలీసులకు ఫిర్యాదు . మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సీపీ అంజనీ కుమార్ . హోంగార్డు వెంకటేష్ ను సస్పెండ్ చేసిన సిపిఐ అంజనీ కుమార్.
  • కరోనా తెలంగాణా బులిటిన్ ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు ఇవ్వాళ నలుగురు మృతి మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.. ఇవ్వాళ 24 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు..

Greater Rayalaseema: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం

దేశంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు తరచూ వినిపిస్తూనే వుంటాయి. ఈ డిమాండ్లు నెరవేరతాయా లేదా అన్నది పక్కన పెడితే రాజకీయ నాయకులకు మాత్రం ఓ వేదిక దొరుకుతుంది. చిన్ని రాష్ట్రాలు అభివృద్ధికి బాటలు వేస్తాయా? లేక నీరుగారుస్తాయా అన్న సందేహాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం కోసం మరోసారి డిమాండ్ తెరమీదికి వస్తోంది.
greater rayalaseema demand again, Greater Rayalaseema: మళ్ళీ తెరమీదికి గ్రేటర్ రాయలసీమ.. గంగుల ఉద్యమం

Greater Rayalaseema separate state demand came into light again: నాలుగు రాయలసీమ జిల్లాలకు రెండు దక్షిణ కోస్తా జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ మరోసారి తెరమీదికి వచ్చింది. చిరకాలంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని భావిస్తున్న కొందరు రాజకీయ నాయకులు, యువజన, విద్యార్థి సంఘాలు గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమాన్ని నిర్మించేందుకు సిద్దమవుతున్నారు.

ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించక ముందు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం. కర్నూలుగా రాజధానిగా 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబర్ 31 దాకా ఆంధ్రరాష్ట్రం కొనసాగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అవతరించడంతో రాజధాని హైదరాబాద్‌కు మారింది. ఆ తర్వాత సుమారు 58 సంవత్సరాలకు ఉమ్మడి ఏపీ విడిపోయింది. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా మిగిలిపోవడంతో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మధ్య ప్రాంతంగా భావించి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే.. ఈ నిర్ణయం కొందరు రాయలసీమ వాసుల్లో అసంతృప్తిని రాజేసింది.

ఇదీ చదవండి: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త మీమాంస

ఒకప్పటి రాజధాని కర్నూలుతోపాటు మొత్తం రాయలసీమ ప్రాంతానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతుందని భావిస్తున్న కొందరు మరోసారి గ్రేటర్ రాయలసీమ నినాదాన్ని భుజానికెత్తుకుంటున్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ఒంగోలు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్. రాయలసీమ హక్కుల కోసం చిరకాలంగా పోరాడుతున్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తాజాగా ఈ నినాదాన్ని మరోసారి సింహపురి కేంద్రంగా వినిపించారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు త్వరలో సతీష్‌రెడ్డి షాక్

నెల్లూరు, ఒంగోలుని కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయాలని, 1937 నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆయనంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా రాయలసీమపై శీతకన్ను వేస్తున్నారని, పెన్నా పరివాహక ప్రాంతం అయిన ఈ జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ప్రతాప్ రెడ్డి. కర్నూలు రాజధానిగా కోల్పోయాం, కృష్ణ నది పక్కనే ఉన్నా నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామని ఆయనంటున్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు, మేధావులు కలిసి రావాలని గంగుల పిలుపునిస్తున్నారు.

ఇదీ చదవండి: రెండు లారీల మధ్య ఇరుక్కున్న బతికిపోయిన లక్కీ ఫెల్లో

అయితే, రాజధానిని వికేంద్రీకరించి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదిస్తున్న తరుణంలో గ్రేటర్ రాయలసీమ డిమాండ్‌కు ఏ మేరకు ప్రజల నుంచి ప్రతిస్పందన, మద్దతు లభిస్తాయన్నది వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: రాజకీయ పార్టీలకు కిషన్‌రెడ్డి సవాల్

Related Tags