యుఎస్‌లో ఇద్దరు టీనేజర్ల ‘ ఇండియన్ యాస’…. ఏం చేశారంటే .. ?
న్యూజెర్సీలో ఇద్దరు టీనేజర్లు తాము చదువుతున్న స్కూల్లోనే రెచ్చిపోయారు. లారెన్స్ టౌన్ షిప్ లో నివసించే 17 ఏళ్ళ కుర్రాళ్ళు ఇద్దరు చేసిన నిర్వాకమిది ! మరి.. వీరిద్దరిదీ ‘ భారతీయ భాష యాస ‘ అట ! కావాలనే అలా మాట్లాడారో లేదో గానీ అసలు విషయంలోకి వెళ్తే.. లారెన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వీరు ఫుట్ బాల్ గేమ్ సందర్భంగా ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిపై […]
న్యూజెర్సీలో ఇద్దరు టీనేజర్లు తాము చదువుతున్న స్కూల్లోనే రెచ్చిపోయారు. లారెన్స్ టౌన్ షిప్ లో నివసించే 17 ఏళ్ళ కుర్రాళ్ళు ఇద్దరు చేసిన నిర్వాకమిది ! మరి.. వీరిద్దరిదీ ‘ భారతీయ భాష యాస ‘ అట ! కావాలనే అలా మాట్లాడారో లేదో గానీ అసలు విషయంలోకి వెళ్తే.. లారెన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వీరు ఫుట్ బాల్ గేమ్ సందర్భంగా ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడమే గాక.. వీరిలో ఒకడు ఆమెపై మూత్ర విసర్జన చేశాడట.. ఆ బాధితురాలు నల్ల జాతీయురాలు.. నల్లజాతి విద్యార్థుల పట్ల కొంతమంది ఇలా అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అని బాధితురాలి తండ్రి తన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. నల్ల జాతీయురాలైన భార్య, పిల్లలు ఉన్న లారెన్స్ టౌన్ షిప్ మేయర్ క్రిస్టోఫర్ బాబిట్.. సోషల్ మీడియాలో ఈ వైనాన్ని ప్రస్తావిస్తూ.. దీన్ని ఖండించాడు. క్యాన్సర్ లాంటి ఈ జాతి విద్వేషాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నాడు. పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని .. దర్యాప్తు జరిపి ఆ ఇద్దరు విద్యార్థులనూ అరెస్టు చేశారు. జేరెల్ బ్లాక్ లే అనే వ్యక్తి తన ట్విట్టర్లో ఈ కుర్రాళ్ళ చర్యను దుయ్యబడుతూ కామెంట్ చేశాడు.