ఇద్దరు చిన్నారులను మింగేసిన సెప్టిక్ ట్యాంక్

జిగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండగకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారితో సహా మరో బాలుడు ప్రమాదవశాత్తు సెప్టెక్ ట్యాంక్ లో జారి పడి దుర్మరణం పాలయ్యారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇద్దరు చిన్నారులను మింగేసిన సెప్టిక్ ట్యాంక్

జిగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండగకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారితో సహా మరో బాలుడు ప్రమాదవశాత్తు సెప్టెక్ ట్యాంక్ లో జారి పడి దుర్మరణం పాలయ్యారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాఖీ పండుగ పురస్కరించుకుని రుతిక(7) తన తల్లితో కలిసి మేడిపల్లికి వచ్చింది. ఇదే క్రమంలో రితిక, మరో బాలుడు అశ్వంత్‌(5) ఇద్దరు చిన్నారులు కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి ఇంటి ముందు ఉన్న సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడిపోయారు. ఈ ఘటనను ఎవరూ గమనించకపోవడంతో.. అప్పటికే పిల్లలిద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలు కనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. చివరికి సెప్టిక్‌ ట్యాంకు గుంతలో విగతజీవులుగా చిన్నారులు కనిపించడంతో తీవ్ర దుఖ: సాగరంలో మునిగిపోయారు. ఇద్దరు చిన్నారుల మరణం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu