తేజ ‘ష్–స్టోరీస్’ : గురువు ఆర్జీవీ బాటలో !
దర్శకుడు తేజ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న ఆయన..డాక్టర్ల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.
Director Teja Web-series : దర్శకుడు తేజ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న ఆయన..డాక్టర్ల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాగా సినిమా షూటింగులు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతో..ప్రస్తుతం వెబ్ కంటెట్‌పై ఫోకస్ పెట్టారు తేజ. అది కూడా ఆయన గురువు ఆర్జీవీ తరహా బోల్డ్ కంటెంట్ ఫాలో అవుతున్నారు. ‘ష్..స్టోరీస్’ పేరుతో అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఫస్ట్ ఎఫిసోడ్ షూటింగ్ కూడా అయిపోయి..ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ తీసిన కరోనా వైరస్ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన దీక్ష గుత్తికొండ ఈ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించిందట. మొదటి ఎఫిసోడ్‌లో చాలా బోల్డ్ కంటెంట్ షూట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను తేజ నిర్మిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా..ఆయన అసిస్టెంట్ రాకేశ్ తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.
ఆగస్టు 3వ వారంలో రెండో షెడ్యూల్ షూట్ చెయ్యడానికి రెడీ అవుతుంది యూనిట్. ఆ లోపు తేజ కరోనా నుంచి కోలుకుంటే..షూటింగ్‌లో పాల్గొంటారట. ఒకవేళ తేజ రికవర్ అవ్వకపోతే..ఆయన అసిస్టెంట్ రాకేశ్ మిగతా పోర్షన్ షూట్ చేస్తారని తెలుస్తోంది.
Read More : అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ : జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్