టీవీ9 ఎఫెక్ట్: లోన్ యాప్ ముఠాల తాటతీస్తోన్న సైబర్ క్రైం పోలీసులు, చైనా దేశస్తులు కార్యకలాపాలపై నిఘా

ఆన్ లైన్ లోన్ యాప్స్ అకృత్యాలను బట్టబయలుచేసి యావత్ సమాజానికీ తెలిసొచ్చేలా చేయడంలో టీవీ9 తనవంతు బాధ్యత నెరవేర్చింది....

టీవీ9 ఎఫెక్ట్: లోన్ యాప్ ముఠాల తాటతీస్తోన్న సైబర్ క్రైం పోలీసులు, చైనా దేశస్తులు కార్యకలాపాలపై నిఘా
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 23, 2020 | 9:40 AM

ఆన్ లైన్ లోన్ యాప్స్ అకృత్యాలను బట్టబయలుచేసి యావత్ సమాజానికీ తెలిసొచ్చేలా చేయడంలో టీవీ9 తనవంతు బాధ్యత నెరవేర్చింది. ఈ ముఠాలకు బలైపోయిన అభాగ్యుల, వాళ్ల కుటుంబాల గోడును కళ్లకు కట్టింది. ఫలితంగా, ఇంతకాలం మీ ఆగడాలు సాగాయి.. కానీ ఇకపై సాగవు అంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. బాధితులు ఫిర్యాదు ఇచ్చాక వదలబోమని చెప్తున్నారు. కాల్‌ మనీ ఆగడాలపై కొరడా ఝులిపిస్తున్నారు. 700 మందికిపైగా ఉద్యోగులపై 41A CRPC కింద కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్‌ కాల్‌ మనీ వెనుక చైనా ముఠాలు ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు మొత్తం 17మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలో ఐదుగురు, హైదరాబాద్‌లో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఇలాఉండగా, హైదరాబాద్‌, ఢిల్లీ, గురుగ్రామ్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నాలుగైదు నెలల క్రితం పక్కా ప్రణాళికతో రుణాలిచ్చే యాప్‌ల సేవలు మొదలయ్యాయి. నగరంలో బేగంపేట, పంజాగుట్ట ప్రాంతాల్లో మూడు కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 600 మంది టెలీకాలర్స్‌ 30 రుణ యాప్‌ల కోసం పని చేస్తున్నారు. గురుగ్రామ్‌లో 500 మంది ఉద్యోగులున్నారు. ఇండోనేషియా, చైనా, తదితర దేశాలకు చెందిన సంస్థల ద్వారా యాప్‌లను నిర్వహిస్తున్నారు. సీసీఎస్‌ పోలీసులు ఢిల్లీ, హైదరాబాద్‌లలో చేపట్టిన దాడుల్లో 11మందిని అరెస్ట్‌ చేశారు.

సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినవారిలో HR మేనేజర్‌ బిందురాణి , సీనియర్‌ మేనేజర్‌ జ్యోతి మాలిక్‌, మేనేజర్‌ అమిత్‌, రమణదీప్‌ సింగ్‌, డైరెక్టర్‌ ప్రభాకర్‌ ధన్‌గ్వాల్‌లను ఢిల్లీలో , సెంటర్‌ హెడ్‌ మధుబాబు సింగి, అసిస్టెంట్‌ మేనేజర్‌ మనోజ్‌కుమార్‌ సింగి, అడ్మిన్‌ మహేష్‌కుమార్‌సింగి, సెంటర్‌ హెడ్‌ తరుణ్‌ , టెక్నికల్‌ హెడ్‌ పవన్‌కుమార్‌, జీవన్‌జ్యోతిలను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. కాల్‌సెంటర్ల నుంచి 700 ల్యాప్‌ట్యాప్‌లు, సర్వర్లు, కంప్యూటర్లు, 10 బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయులను సంస్థల డైరెక్టర్లుగా నియమించి తెర వెనుక నుంచి చైనా దేశస్తులు కార్యకలాపాలు సాగిస్తుండవచ్చని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. సైబరాబాద్‌ పోలీసులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా ఇద్దరు డైరెక్టర్లు, మరో ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేశారు. రెండు సంస్థలకు సంబంధించిన 18 ఖాతాలను క్లోజ్‌ చేశారు. క్యాష్‌ మామా అనే రుణ యాప్‌ నిర్వాహకులు డబ్బు తిరిగి చెల్లించినా.. ఇంకా కట్టాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ బాధితుడు ఈ నెల 8న సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. రాయదుర్గంలోని ఓ భవనంలో కొనసాగుతున్న ఆనియన్‌ క్రెడిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్రెడ్‌ ఫాక్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. మూడు యాప్‌లు క్యాష్‌ మామా, ధనాధన్‌ లోన్‌, లోన్‌ జోన్‌ నుంచి ఇప్పటి వరకు 1.5 లక్షల మంది రుణాలు తీసుకున్నట్లు తేలింది. నిర్వాహకులు రుణ గ్రహీతల గడువు ముగిసే రోజును 0డే-గా వ్యవహరిస్తున్నారు. ఈ కేటగిరీలో కొచ్చే వారితో చాలా మర్యాదగా మాట్లాడతారు. గడువు ముగిశాక మూడ్రోజుల వరకు వారికి ఫోన్లు చేసి రుణం తిరిగి చెల్లించకుంటే లీగల్‌ నోటీసులు పంపిస్తామని బెదిరిస్తారు. నాలుగోరోజు దాటిపోయాక పదో రోజు వరకు ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తారు. వాట్సాప్‌ గ్రూప్స్‌లో రుణం చెల్లించలేదంటూ ప్రచారం చేస్తారు. 11 నుంచి 30 రోజుల వరకు రుణ గ్రహీతల ఫోన్ల నుంచి స్నేహితులు, బంధువుల నంబర్లు సేకరించి వారికి ఫోన్‌ చేస్తారు. ఇలా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ తొమ్మిది ఎన్‌బీఎఫ్‌సీలు, గూగుల్‌ ప్లే స్టోర్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!