ఏపీలో కొత్త ప్రభుత్వం.. రేపు టీటీడీ పాలకమండలి సమావేశం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) పాలకమండలి సమావేశం జరగనుంది. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం మండలి కొనసాగుతుండగా.. రాష్ట్రంలో వైసీపీ కొత్తగా పగ్గాలు చేపటనున్న నేపథ్యంలో మండలి కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. దీంతో రేపు జరుగుతున్న సమావేశంపై ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పటికే సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదాపడింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిపోవడంతో నామినేటెడ్ పదవుల విషయంలో సందేహాలు కొనసాగుతున్నాయి. […]

ఏపీలో కొత్త ప్రభుత్వం.. రేపు టీటీడీ పాలకమండలి సమావేశం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 27, 2019 | 10:54 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) పాలకమండలి సమావేశం జరగనుంది. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం మండలి కొనసాగుతుండగా.. రాష్ట్రంలో వైసీపీ కొత్తగా పగ్గాలు చేపటనున్న నేపథ్యంలో మండలి కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. దీంతో రేపు జరుగుతున్న సమావేశంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఇప్పటికే సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదాపడింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిపోవడంతో నామినేటెడ్ పదవుల విషయంలో సందేహాలు కొనసాగుతున్నాయి. కాగా సమావేశం నేపథ్యంలో ఇప్పటికే పలువురు సభ్యులు తిరుమల చేరుకున్నారు. ఇక ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, మండలి భవితవ్యం ఏంటన్నది త్వరలోనే తేలనుంది.