తిరుమల వెంకటేశ్వరస్వామి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేసిన టీటీడీ
తిరుమల శ్రీనివాసుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. పలు ఉత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లను వివిధ తేదీలలో ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది.
Virtual Acquired Services : తిరుమల శ్రీనివాసుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. పలు ఉత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లను వివిధ తేదీలలో ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది.
శ్రీవారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. ఒక్కో సేవకు సంబంధించి రోజుకు ఐదు వేల టికెట్లను భక్తులకు అందించనున్నారు.
నవంబరు 15 నుంచి 30వ తేదీ వరకు కళ్యాణోత్సవం టికెట్లు, 22 నుంచి 30వ తేదీ వరకు మిగిలిన ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులో ఉంచారు. కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం ఉచితంగా కల్పించనున్నారు.
మిగిలిన సేవలు ఎంచుకున్నవారు అదనంగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. వీరు 90రోజుల్లో అందుబాటులో ఉన్న టైమ్ స్లాట్స్ ఆధారంగా దర్శనాలు బుక్ చేసుకునే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.