మంత్రి తలసానితో మెగా మీటింగ్.. ముఖ్యంగా వీటిపైనే చర్చ

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ అమలు పరుస్తోంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు..

మంత్రి తలసానితో మెగా మీటింగ్.. ముఖ్యంగా వీటిపైనే చర్చ
Follow us

| Edited By:

Updated on: May 21, 2020 | 10:07 AM

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ అమలు పరుస్తోంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. ఈ లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా సినీ పరిశ్రమలో అన్ని రకాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ మధ్యనే కొన్ని మార్గదర్శకాల ప్రకారం కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. కాగా కోవిడ్-19 కారణంగా పలు పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. అందులో చిత్ర పరిశ్రమ కూడా ఉంది.

ఈ సినీ ఇండస్ట్రీపై ఆధారపడి ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. మరో రెండు, మూడు నెలల వరకూ తెరుచుకునేందుకు కూడా అవకాశాలు కనిపించడంల లేదు. ఈలోగా చిత్ర పరిశ్రమ కోలుకునేలా షూటింగ్స్ ఎలా ప్రారంభించాలి? థియేటర్స్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశాలపై ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సినిమా పరిశ్రమ ప్రముఖులు సమావేశం అవుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి