ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..

భారీగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బ‌కాయిలు వ‌సూలు చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు తెలంగాణ మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ సూప‌ర్ ఆఫ‌ర్ అనౌన్స్ చేశారు.

ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..
Follow us

|

Updated on: Jul 29, 2020 | 7:45 AM

GHMC Property Tax : భారీగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బ‌కాయిలు వ‌సూలు చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు తెలంగాణ మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ సూప‌ర్ ఆఫ‌ర్ అనౌన్స్ చేశారు. జీహెచ్‌ఎంసీ, పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్‌(వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్) పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేర‌కు గ్రేట‌ర్ హైదరాబాద్‌లో ప్రాపర్టీ టాక్స్‌పై వడ్డీ భారాన్ని తగ్గించింది ప్ర‌భుత్వం. 2019-20 ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో క‌డితే.. 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ అవకాశం క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పిన మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా గ్రేట‌ర్ ప‌రిధిలోనే 5.64ల‌క్ష‌ల మంది ప్రాప‌ర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారు.

Read More : మహిళా గ్రామ వాలంటీర్​పై వృద్ధుడి అసభ్య ప్రవర్తన..నిర్భయ కేసు న‌మోదు