వినాశన జోస్యం..తప్పు.. ఆశావాదమే బెస్ట్ : ట్రంప్

పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం వల్ల ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందన్న ‘ ప్రవక్తల’ ‘జోస్యాన్ని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. మంగళవారం దవోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన.. తన కీనోట్ ప్రసంగంలో.. క్లైమేట్ యాక్టివిస్టులను దుయ్యబట్టారు. వారి వాదనను ‘ నిన్నటితరం వారసుల మూర్ఖత్వపు భవిష్యత్ జోస్యాలుగా ‘ కొట్టిపారేశారు. ఇప్పుడు మనకు కావలసింది నిరాశావాదం కాదు.. ఆశావాదం..(దిసీజ్ టైం ఫర్ ఆప్టిమిజం) అని వ్యాఖ్యానించారు. 1960 […]

వినాశన జోస్యం..తప్పు.. ఆశావాదమే బెస్ట్ : ట్రంప్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 21, 2020 | 7:06 PM

పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం వల్ల ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందన్న ‘ ప్రవక్తల’ ‘జోస్యాన్ని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. మంగళవారం దవోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన.. తన కీనోట్ ప్రసంగంలో.. క్లైమేట్ యాక్టివిస్టులను దుయ్యబట్టారు. వారి వాదనను ‘ నిన్నటితరం వారసుల మూర్ఖత్వపు భవిష్యత్ జోస్యాలుగా ‘ కొట్టిపారేశారు. ఇప్పుడు మనకు కావలసింది నిరాశావాదం కాదు.. ఆశావాదం..(దిసీజ్ టైం ఫర్ ఆప్టిమిజం) అని వ్యాఖ్యానించారు. 1960 ప్రాంతంలో ప్రపంచ జనాభా విప్లవం వల్ల పెను నష్టం సంభవిస్తుందని, 1990 ప్రాంతంలో చమురు నిల్వలు తగ్గిపోయి ప్రపంచ దేశాలకుతీవ్రమైన ముప్పు కలుగుతుందని కొందరు చెప్పిన జోస్యాలు ఏమయ్యాయని ట్రంప్ ప్రశ్నించారు. ఇలాంటివే ఇంకా ఎన్నో చెప్పారన్నారు. తమ దేశ ఆయిల్ రెవల్యూషన్ గురించి ప్రస్తావించిన ఆయన.. రష్యా వంటి దేశాల కన్నా మా దేశ ఇంధనాన్ని కొనుగోలు చేయాలని  యూరప్ దేశాధినేతలను కోరారు.

కాగా-క్లైమేట్ చేంజ్ పై పోరాడుతున్న 17 ఏళ్ళ అమ్మాయి.. గ్రెటా థన్ బెర్గ్.. ట్రంప్ మాటలకు చిన్నబుచ్చుకుంది. ఆడియెన్స్ లో కూర్చున్న ఈమె ఎంతో మనస్థాపం చెందినట్టు కనిపించింది.అటు-ఉదయం ఓ చర్చాగోష్టిలో పాల్గొన్న థన్ బెర్గ్.. వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పులగురించి ప్రపంచ దేశాధినేతలు పట్టించుకోవడంలేదని వాపోయింది. వాతావరణ కాలుష్యం కారణంగా మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుందని పేర్కొంది.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్