అమెరికా ఎన్నికల ముందు ఘర్షణలు, ట్రంప్ ఆదేశాలు

అమెరికాలో నవంబరులో జరగనున్న ఎన్నికల  ముందు అప్పుడే పలు నగరాల్లో ఘర్షణలు, అల్లర్లు ప్రారంభమయ్యాయి, రేసిజాన్ని వ్యతిరేకిస్తూ, ట్రంప్ కి వ్యతిరేకంగా తాజాగా పోర్ట్ ల్యాండ్ లో ఘర్షణలు జరగగా ఓ వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు.

అమెరికా ఎన్నికల ముందు ఘర్షణలు, ట్రంప్ ఆదేశాలు
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Aug 31, 2020 | 12:02 PM

అమెరికాలో నవంబరులో జరగనున్న ఎన్నికల  ముందు అప్పుడే పలు నగరాల్లో ఘర్షణలు, అల్లర్లు ప్రారంభమయ్యాయి, రేసిజాన్ని వ్యతిరేకిస్తూ, ట్రంప్ కి వ్యతిరేకంగా తాజాగా పోర్ట్ ల్యాండ్ లో ఘర్షణలు జరగగా ఓ వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఓరెగాన్ సిటీలో తన అనుకూలురతో నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్న డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్.. ట్రంప్ పై విరుచుకపడ్డారు. అల్లర్లను ఆయనే రెచ్ఛగొడుతున్నాడని ఆరోపించారు. తాను అద్యక్షుడినతే నేషనల్ గార్డులను నిరసనకారులపైకి ఉసి గొల్పనని అన్నారు. ఇటీవలే విస్కాన్ సిటీలోని కెనోషా నగరంలో ఓ నల్ల జాతీయుడిని పోలీసులు కాల్చి చంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

డెమొక్రాట్ల ప్రాబల్యం ఉన్న నగరాల్లో అల్లర్లు, నిరసన ప్రదర్శనలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని ట్రంప్ తమఫెడరల్ దళాలను ఆదేశించారు. ‘ నేనే చట్ట పరిరక్షకుడిని’ అన్న టైపులో తనను తాను ఆయన అభివర్ణించుకున్నారు. జో బిడెన్ అధ్యక్షుడైతే.. వామపక్ష తీవ్రవాదం పెరిగిపోతుందని ట్రంప్ ధ్వజమెత్తారు. అయితే బిడెన్ దీన్ని ఖండిస్తూ..  ఎన్నికల్లో ట్రంప్ పరాజయం తథ్యమని అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu