ఫేస్ బుక్, ట్విటర్ పై ట్రంప్ చిందులు, ఎందుకంటే ?

ఫేస్ బుక్, ట్విటర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ ఆగ్రహం వ్యక్తం  చేశారు. తన ప్రత్యర్థి, అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ను విమర్శిస్తూ ప్రచురించిన ఓ కథనాన్ని ఈ రెండు మాధ్యమాలూ సెన్సార్ చేశాయని ఆయన ఆరోపించారు. బైడెన్, ఆయన కుమారుడు హుంటర్ బైడెన్ కుసంబంధించి న్యూయార్క్ పోస్ట్ లో వఛ్చిన కథనాన్ని ఇవి కావాలనే సెన్సార్ చేశాయని ఆయన అన్నారు. ‘ఇది వారికినాంది మాత్రమే ! ఒక అవినీతి పొలిటీషియన్ […]

ఫేస్ బుక్, ట్విటర్ పై ట్రంప్ చిందులు, ఎందుకంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 15, 2020 | 6:14 PM

ఫేస్ బుక్, ట్విటర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ ఆగ్రహం వ్యక్తం  చేశారు. తన ప్రత్యర్థి, అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ను విమర్శిస్తూ ప్రచురించిన ఓ కథనాన్ని ఈ రెండు మాధ్యమాలూ సెన్సార్ చేశాయని ఆయన ఆరోపించారు. బైడెన్, ఆయన కుమారుడు హుంటర్ బైడెన్ కుసంబంధించి న్యూయార్క్ పోస్ట్ లో వఛ్చిన కథనాన్ని ఇవి కావాలనే సెన్సార్ చేశాయని ఆయన అన్నారు. ‘ఇది వారికినాంది మాత్రమే ! ఒక అవినీతి పొలిటీషియన్ కన్నా అధ్వాన్నమైనదేదీ ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.  అసలు కథేమిటంటే…బైడెన్ తో బాటు ఆయన కుమారుడు హంటర్ నిర్వహిస్తున్న బిజినెస్ లో అవినీతి లావాదేవీలు జరిగాయని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఫేస్ బుక్, ట్విటర్ దీనికి సంబంధించిన లింక్ లను బ్లాక్ చేశాయి.

‘స్మోకింగ్ గన్-ఈ-మెయిల్ రివీల్స్ హౌ హంటర్ బైడెన్ ఇంట్రొడ్యూస్డ్ ఉక్రేనియన్ బిజినెస్ మన్ టు విపి  డాడ్’ అనే శీర్షికన ఈ న్యూస్ పేపర్ ఈ ఆర్టికల్ కి  హెడ్ లైన్ పెట్టింది. ఉక్రెయిన్ లోని బిజినెస్ వ్యవహారాల్లో తన తండ్రిని ఇరికిస్తూ హంటర్ ఎక్కడో ఓ కంప్యూటర్ రిపెయిర్ షాపులో వదిలేసిన ఓ కంప్యూటర్ ని తాము సంపాదించామని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. అందులోని అంశాలను బట్టి ఈ కథనాన్ని ఇస్తున్నామని తెలిపింది. అయితే ఈ కథనంలోని నిజానిజాలను నిర్ధారించుకోకుండా తాము ఈ లింక్ లను పోస్ట్ చేయడంలేదని ఫేస్ బుక్, ట్విటర్ వివరించాయి. ఇదే ట్రంప్ సార్ ఆగ్రహానికి కారణమైంది.