సోమాలియాలో పేలిన కారు బాంబు.. 80 మంది మృతి

సోమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని మొగదిషులో మారణహొమం సృష్టించారు. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 80 మందికి పైగా మృతిచెందగా.. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. భారీ పేలుడు సంభవించడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూటీం రంగంలోకి దిగి.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి […]

సోమాలియాలో పేలిన కారు బాంబు..  80 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 9:38 PM

సోమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని మొగదిషులో మారణహొమం సృష్టించారు. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 80 మందికి పైగా మృతిచెందగా.. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. భారీ పేలుడు సంభవించడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూటీం రంగంలోకి దిగి.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెల్పినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 73 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చాలా మంది స్థానిక విశ్వవిద్యాలయానికి చెందిన స్టూడెంట్స్‌ ఉన్నారన్నారు. స్థానిక పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని.. ఇందుకు రద్దీగా ఉన్న జంక్షన్లను ఎంచుకుని దాడికి పాల్పడ్డారన్నారు.

కాగా, ఈ ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటనలు చేయలేదు. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం ఇది.. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్‌-షబాబ్‌ సంస్థ ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.