ఆ సంస్కృతిని ప్రారంభించిందే కాంగ్రెస్‌

పార్టీలు ఫిరాయించే సంస్కృతిని ప్రారంభించిందే కాంగ్రెస్‌ పార్టీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్పీ ఎన్నికలలో అఖండ విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2004 ఎన్నికల్లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని ఆ పార్టీలో కలుపుకోలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో మూడింట రెండొంతుల మంది లేకపోయినా సరే నిరంకుశంగా వ్యవహరించలేదా? అని నిలదీశారు. […]

ఆ సంస్కృతిని ప్రారంభించిందే కాంగ్రెస్‌
Follow us

|

Updated on: Jun 08, 2019 | 10:15 PM

పార్టీలు ఫిరాయించే సంస్కృతిని ప్రారంభించిందే కాంగ్రెస్‌ పార్టీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్పీ ఎన్నికలలో అఖండ విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2004 ఎన్నికల్లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని ఆ పార్టీలో కలుపుకోలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో మూడింట రెండొంతుల మంది లేకపోయినా సరే నిరంకుశంగా వ్యవహరించలేదా? అని నిలదీశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలను, ఎంపీలను చేర్చుకోవడం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఆ పార్టీ నేతలకు గుర్తు రాలేదా? అన్నారు. వాళ్లతో పోలిస్తే మేం చాలా హుందాగా వ్యవహరించామన్నారు. సీఎల్పీ విషయంలో స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారని, అందులో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తామంటే వారు చేర్చుకోరా అని కేటీఆర్ ప్రశ్నించారు.