AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hidden Treasure: వేలకోట్ల ఖజానాకు కోట…తెరుచుకోని విధంగా శాపగ్రస్తం..నాటి మొఘలల నుంచి నేటి గ్రామస్తుల సహా విఫలం

ఈ కోటలోని కొన్ని వేల కోట్ల నిధిని సొంతం చేసుకోవడానికి నాటి మొఘలు, రాజులు నుంచి నేటి గ్రామస్తులతో సహా చాలా మంది  కోటలోకి తవ్వి, రహస్య సొరంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు అయినప్పటికీ అందరూ విఫలం..

Hidden Treasure: వేలకోట్ల ఖజానాకు కోట...తెరుచుకోని విధంగా శాపగ్రస్తం..నాటి మొఘలల నుంచి నేటి గ్రామస్తుల సహా విఫలం
Surya Kala
|

Updated on: Jan 22, 2021 | 6:14 PM

Share

Hidden Treasure fort: కొన్ని చరిత్రలు వాటి తాలూకా జ్ఞాపకాలు కాలంతోపాటు కనుమరుగవుతాయి. మరికొన్ని ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా కథలుగా మిగిలిపోతాయి. అలాంటి ఒక కథలాంటి చరిత్ర.. ఒక రాజు అత్యాశ గురించి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం.. అది రెండువందల యాభై ఏళ్ల క్రితం నాటి నిధికి చెందిన అతి రహస్యమైన కథ. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఒక రాజవంశం ఖజానా కథ ఇది. ఆ రాజుకు, ఆ రాజకుటుంబానికి చెందిన ఆ ఖజానా.. శాపగ్రస్తమైంది. ఒక పాము ఆ ఖజానాకు నిత్యం రక్షగా ఉంటుందని, దాని దగ్గరకు ఎవరైనా వెళ్లడానికి ప్రయత్నిస్తే మృత్యువు తప్పదని అంటారు. హమీర్‌పూర్‌ అనే ఏరియాలో ఇప్పటికీ ఆ నిధి ఉందని, అక్కడి కోటకు పాము రక్షగా ఉంటుందని స్ధానికులు నమ్ముతారు.

ఇవి కల్పిత కధలు కావు. వాస్తవాలు. వేలమంది ప్రజలు నమ్మే నిజాలు. ఒక రాజు తన ఖజానాకు వందల పాములను రక్షగా పెట్టాడని, ఎవరైనా వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తే.. సొరంగమార్గాలు వాటంతట అవే మూసుకుపోతాయని అక్కడి స్ధానికులు నమ్ముతారు. రాజులు, వాళ్ల ఖజానాలు. ఇలా మరుగున పడిపోయిన ఎన్నో కథలను మనం వినుంటాం చూసి ఉంటాం. పద్మనాభస్వామి ఖజానాను పోలిన ఈ ఖజానా కధ మాత్రం వాటన్నిటికంటే భిన్నమైనది. ఇలాంటి కధను మీరు ఖచ్చితంగా ఇంతకుముందు విని ఉండరు.

అది హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ ఏరియా. చుట్టుపక్కల కిలోమీటర్లు మనిషన్నవాడు కనబడడు. ఎటుచూసినా చెట్లు, పారుతున్న సెలయ్యేళ్లు, క్రూరమృగాల చప్పుళ్లు. అక్కడుండే ఆటవికులు కూడా వెళ్లడానికి భయపడతారు. అలాంటి దట్టమైన అడవిలో నాలుగు కిలోమీటర్ల కాలినడక. హమీర్‌పూర్‌లోని ఈ రహస్య ఖజానాను దక్కించుకోవడానికి ఇప్పటికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. కానీ.. ఎవరివల్ల కాలేదు. వెళ్లినప్రతీ ఒక్కరూ పెద్దపెద్ద పాములను చూశామని, వాటినుంచి తప్పించుకుని బయటకు వచ్చామని చెప్పడంతో ఎవరూ అటువైపు వెళ్లే సాహసం చేయడంలేదు. ఈ కోటను సుజానేపూర్ కోట అని కూడా పిలుస్తారు . దాచిన నిధుల కారణంగానే ఈ కోటను హమీర్‌పూర్ యొక్క ‘ఖాజాంచి కోట’ అని పిలుస్తారు. కటోచ్ రాజవంశం యొక్క రాజు అభయ్ చంద్ 1758 లో నిర్మించారు. తరువాత రాజా సంసార్ చంద్. చేత పాలించబడింది.1845 కాలంలో రాజా సంసార్‌చంద్‌ దగ్గర వేలకోట్ల విలువైన ఖజానా ఉండేది. దాన్ని శతృవుల దాడి నుంచి కాపాడేందుకు ఈ కోటలో బంగారాన్ని దాచిపెట్టారని చెప్తారు. ఖజానాకు చేరుకునేందుకు కొన్ని రహస్య గుహలను కూడా రాజా సంసార్‌చంద్‌ ఏర్పాటు చేయించాడు. తనకు తప్ప మరెవరికీ తెరుచుకోనివిధంగా ఆ ఖజానాను శాపగ్రస్తం చేశాడని అంటారు. రాజకుటుంబీకులు ఎవరికీ కూడా ఈ రహస్యాన్ని రాజా చెప్పలేదు.

వందల ఏళ్లుగా అలానే పడి ఉన్న ఈ కోట ప్రాంతంలో.. ఆ రహస్య సొరంగంతో పాటు.. దాన్ని దక్కించుకోవడానికి గుప్తనిధుల వేటగాళ్లు సాగించిన ప్రయత్నం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయి.ఈ నిధి యొక్క రహస్యం ఈ రోజుకు బహిర్గతం కాలేదు .. ఈ రోజు వరకు ఎవరూ నిధిని చేరుకోకపోయినా, సంసార్ చంద్ రాజు యొక్క నిధి ఇప్పటికీ కోటలో ఉందని చెబుతారు. దాదాపు ఆరు నుంచి 7కిలోమీటర్లు ఈ సొరంగం ఉందని స్ధానికులు చెప్తారు. ఈ ఖజానాను దక్కించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్లలో సగం మంది కూడా కోట వరకూ చేరుకోలేకపోయారని అక్కడి జనం చెప్తారు. దారిలోనే అత్యంత ప్రమాదకర పాములు వారిని అడ్డుకున్నాయని, ఆధ్యాత్మిక శక్తులు నిధిని రక్షిస్తాయని.. అవే ఖజానాకు రక్షగా ఉంటాయని నమ్ముతారు. కోట చుట్టూ నివసిస్తున్న గ్రామస్తులు రాత్రి కోట నుండి వింత శబ్దాలు వస్తాయని చెబుతారు.

విశేషమేమిటంటే ఈ కోటలోని వేల కోట్ల నిధిని సొంతం చేసుకోవడానికి నాటి మొఘలు, రాజులు నుంచి నేటి గ్రామస్తులతో సహా చాలా మంది  కోటలోకి తవ్వి, రహస్య సొరంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు అయినప్పటికీ అందరూ విఫలమయ్యారని అక్కడ దొరికిన ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది.

Also Read: వర్కింగ్ ఉమెన్ కోసం ఈజీగా కుకింగ్.. క్షణాల్లో ఆరోగ్యకరమైన వంటకాలు