AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 5PM

1.చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌కు చంద్రబాబు..ఈ సారి ఏం చేశారంటే? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు…Read more  2.కేంద్రానికి షాక్ ? 370 అధికరణం రద్దుపై ఇక ‘ సుప్రీం ‘ విచారణ ! జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 […]

టాప్ 10 న్యూస్ @ 5PM
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 28, 2019 | 5:13 PM

Share

1.చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌కు చంద్రబాబు..ఈ సారి ఏం చేశారంటే?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు…Read more 

2.కేంద్రానికి షాక్ ? 370 అధికరణం రద్దుపై ఇక ‘ సుప్రీం ‘ విచారణ !

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో.. వీటిపై విచారణకు కోర్టు అయిదుగురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎన్.వి. రమణ…Read more

3.కశ్మీర్ లో మళ్ళీ కాల్పుల కలకలం .. భారత జవాన్ల దుస్తుల్లో… టెర్రరిస్టులు!

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శనివారం ఉదయం రెండు ఎన్ కౌంటర్లు, గ్రెనేడ్ దాడులతో ఈ రాష్ట్రం ఉలిక్కిపడింది. రంబన్ జిల్లా బాటోట్ లో భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. అక్కడ టెర్రరిస్టులు…Read more

4.ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య పదవికి ఎసరు..వన్ మంత్ డెడ్‌ లైన్!

టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య దూకుడుకు ఏపీ ప్రభుత్వం బ్రేకులు వేయబోతుంది. వెంటనే పదవిలో నుంచి తప్పుకోవాలని అధికారుల నుంచి ఆయనకు నోటీసులు అందాయి. ఈ మేరకు నెల పాటు డెడ్‌ లైన్ విధించారు.  అలాగే విజయవాడ…Read more

5.రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు… ఏ అమ్మవారికి ఏ నైవేద్యం!

రేపటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో అమ్మవారు తొలిరోజు దర్శనమీయనున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలతో దర్శనమివ్వనున్నారు…Read more

6.హుజూర్‌నగర్‌​ హోరాహోరీ.. ప్రధాన పార్టీ వ్యూహాలేంటో తెలుసా..?

హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ మారింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అవ్వడంతో.. ఈసీ ఈ స్థానానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల పర్వం మొదలైంది…Read more

7.తెలంగాణ సంస్కృతికి  నిదర్శనం బతుకమ్మ: సీఎం కేసీఆర్

బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు  సీఎం కేసీఆర్. బతుకమ్మ కోసం చెరువులు, దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించిన కేసీఆర్…Read more

8.శ్రీరామ్ ఆలాపనతో.. “సామజవరగమన” మరో చాట్ బస్టర్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజా హెగ్డే జోడీగా వస్తున్న “అలవైకుంఠపురంలో”ని తొలి మెలోడీ అయిన “సామజవరగమన” వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. దువ్వాడ జగన్నాథం మూవీలో జంటగా నటించిన వీరిద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు…Read more

9.‘తేనేటీగలు’ లేకపోతే.. మనుషుల మనుగడ కష్టమట..?

ఏంటీ షాక్‌ అయ్యారా..! తేనేటీగలు లేకపోతే.. మనుషుల మనుగడ కష్టమవుతుందా..? అవునా అంటే నిజమేనని అంటున్నారు జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్ర్తవేత్తలు. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని లండన్ శాస్త్రవేత్తలు…Read more

10.అరివీర భయంకర రానాతో ‘హౌస్‌ఫుల్- 4’

బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా వస్తోన్న తాజా చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతి సనన్, బాబీ డియోల్, కృతి కర్బందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా…Read more

Follow Us
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..