Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

శ్రీరామ్ ఆలాపనతో.. “సామజవరగమన” మరో చాట్ బస్టర్

Ala Vaikunthapuramloo Samajavaragamana Lyrics Song Released, శ్రీరామ్ ఆలాపనతో.. “సామజవరగమన” మరో చాట్ బస్టర్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజా హెగ్డే జోడీగా వస్తున్న “అలవైకుంఠపురంలో”ని తొలి మెలోడీ అయిన “సామజవరగమన” వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. దువ్వాడ జగన్నాథం మూవీలో జంటగా నటించిన వీరిద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. డీజే మూవీలో కూడా గుడిలో బడిలో అనే మెలోడీ సాంగ్‌తో వారు ప్రేక్షకులను అలరించారు. తాజాగా “అలవైకుంఠపురంలో” సినిమాతో మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు.

Ala Vaikunthapuramloo Samajavaragamana Lyrics Song Released, శ్రీరామ్ ఆలాపనతో.. “సామజవరగమన” మరో చాట్ బస్టర్

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. “ఉండిపోరాదే” సాంగ్ తో ఫేమస్ అయిన సీద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. వీడియోలో తమన్ పియానో వాయిస్తూ.. శ్రీరామ్ పాటను ఆలపిస్తూ కనిపించారు. “నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు”.. అసలు అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా సాగింది. ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. అందుకే ఇప్పటినుంచే ఈ సినిమాకి ఫుల్‌గా బజ్ పెంచే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్‌మెంట్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది.