తెలంగాణ సంస్కృతికి  నిదర్శనం బతుకమ్మ: సీఎం కేసీఆర్

బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు  సీఎం కేసీఆర్. బతుకమ్మ కోసం చెరువులు, దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించిన కేసీఆర్… తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలి. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది అని కేసీఆర్  వివరించారు […]

తెలంగాణ సంస్కృతికి  నిదర్శనం బతుకమ్మ: సీఎం కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 4:50 PM

బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు  సీఎం కేసీఆర్. బతుకమ్మ కోసం చెరువులు, దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించిన కేసీఆర్… తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలి. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది అని కేసీఆర్  వివరించారు . అక్టోబర్ 2 న గ్రామ పంచాయతీలలో.. 4న నగరాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎంగిలి పూలతో మొదలై తొమ్మిదవ రోజు మహా బతుకమ్మతో ముగియనున్నాయి.

అక్టోబర్ 3న లుంబినీ పార్కులో మహా బతుకమ్మ:

టీఎన్జీవో ఆధ్వర్యంలో అక్టోబర్ 3న హైదరాబాద్ లోని లుంబినీ పార్కులో మహా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తెలిపారు. దీనికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ హాజరవుతారని చెప్పారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్​లో కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, రేచల్ విడుదల చేశారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు పెద్ద పెట్టున పాల్గొనాలని పిలుపునిచ్చారు.