Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

అరివీర భయంకర రానాతో ‘హౌస్‌ఫుల్- 4’

బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా వస్తోన్న తాజా చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతి సనన్, బాబీ డియోల్, కృతి కర్బందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా విలన్‌గా నటిస్తున్నాడు. ఫర్హాద్ సామే జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కథాంశం పునర్జన్మల నేపధ్యంలో సాగుతుంది.

1419, 2017 ల మధ్య కాలంలో సాగే కథాంశంతో వినోదాత్మకంగా రూపొందించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌లో కామెడీ, కన్ఫ్యూషన్‌తో నింపేసి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే రానా దగ్గుబాటి అరివీర భయంకరమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి పాత్రను మలిచిన తీరును చూస్తే బాహుబలి మూవీలో దాదాపు ‘కల్కి’ రోల్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. కథలో అక్షయ్‌కి తన పునర్జన్మ గుర్తుకు రాగా.. మిగిలిన నటీనటులకు వారి పునర్జన్మలు గుర్తు చేసే క్రమంలో అక్షయ్ పడిన నానా తంటాలను దర్శకుడు కామెడీగా చిత్రీకరించారు. దగ్గుబాటి రానా నటించిన పాత్ర కోసం మొదట బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే ఆయన మీటూ ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆ స్థానాన్ని మన భల్లాలదేవుడు భర్తీ చేశాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.