‘నిఖిల్ 20’వ సినిమా ఫిక్స్‌.. నిర్మాతలెవ‌రంటే?

టాలీవుడ్‌ యంగ్ హీరో 'నిఖిల్ 20'వ సినిమా ఫిక్స్ అయింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశాడు నిఖిల్. అలాగే త‌న 20వ సినిమాకు సంబంధించి ప‌లు వివ‌రాలు తెలియ‌జేశాడు. ''నారాయ‌ణ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్ మోహ‌న రావు నిర్మాత‌లుగా ఉండ‌గా..

  • Tv9 Telugu
  • Publish Date - 2:24 pm, Fri, 31 July 20
'నిఖిల్ 20'వ సినిమా ఫిక్స్‌.. నిర్మాతలెవ‌రంటే?

టాలీవుడ్‌ యంగ్ హీరో ‘నిఖిల్ 20’వ సినిమా ఫిక్స్ అయింది. ఈ మ‌ధ్యే ‘అర్జున్ సుర‌వ‌రం’ లాంటి హిట్‌తో స‌క్సెస్‌లో ఉన్న ప్రామిసింగ్ యంగ్ హీరో నిఖిల్.. ఇందుకు సంబంధించి అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశాడు నిఖిల్. ‘ఈ సినిమాని శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) బ్యాన‌ర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా నిర్మించ‌నుండ‌గా, సోనాలీ నారంగ్ స‌మ‌ర్పించ‌నున్నారు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను రెయిన్‌బో రీల్స్’ చూసుకోబోతున్న‌ట్లు ట్వీట్‌లో పేర్కొన్నాడు నిఖిల్.

నిఖిల్ కెరీర్‌లో మ‌ర‌పురాని చిత్రంగా నిలిచే ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి ప‌నిచేసే ద‌ర్శ‌కుడు, తారాగ‌ణం, ఇత‌ర సాంకేతిక బృందం వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. నిఖిల్ ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2’, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో ’18 పేజెస్‌లో నటిస్తున్నాడు.

Read More:

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..

త‌న తాత‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ.. ట్వీట్ చేస్తూ..