గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన క‌మెడియ‌న్ అలీ..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సార‌ధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు అలీ. ఎంపి సంతోష్ కుమార్ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలీ పేర్కొన్నారు. అనంతరం మరో ఇద్దరికి ఆయ‌న […]

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన క‌మెడియ‌న్ అలీ..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సార‌ధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు అలీ. ఎంపి సంతోష్ కుమార్ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలీ పేర్కొన్నారు. అనంతరం మరో ఇద్దరికి ఆయ‌న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. సోద‌రుడు, సినీ ఆర్టిస్ట్ ఖయుమ్, అలీ బావమరిది కరీంకు గ్రీన్ ఛాలెంజ్ చేప‌ట్టి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Read More:

బిగ్ బ్రేకింగ్ః క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి

విశాఖ ‘షిప్ యార్డు ప్ర‌మాద ఘ‌ట‌న’‌పై సీఎం జ‌గ‌న్ ఆరా..

‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం