బిగ్ బ్రేకింగ్ః కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో మృతి చెందారు. ఆయన మృతికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. గత కొంతకాలంగా ఛాతీ నొప్పి, హైబీపీతో బాధపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో..

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో మృతి చెందారు. ఆయన మృతికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. గత కొంతకాలంగా ఛాతీ నొప్పి, హైబీపీతో బాధపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. దీంతో అక్కడ ఆయనకు కరోనా టెస్ట్ చేయగా.. కోవిడ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మాణిక్యాల రావుకి పాజిటివ్ వచ్చిన తరువాత.. తన ఆరోగ్యానికి సంబంధించి వీడియోతో పాటు ట్వీట్ కూడా చేశారు.
గత నెల జులై 4వ తేదీ నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితమే మరణించారు. కాగా మాణిక్యాల రావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.
కాగా 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు. జిల్లా స్థాయి నాయకుడి నుంచి మంత్రి స్థాయి వరకూ అంచెలంచెలుగా మాణిక్యాలరావు ఎదిగారు. నేటి రాజకీయాల్లో విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పార్టీని నమ్ముకుని.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు వస్తాయని చెప్పేందుకు మాణిక్యాలరావు ఉదాహరణ. దేవదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అనేక ఆలయాలు అభివృద్ధికి తన వంతు కృషి చేశారు మాణిక్యాలరావు.
Read More:
విశాఖ ‘షిప్ యార్డు ప్రమాద ఘటన’పై సీఎం జగన్ ఆరా..
‘ఆత్మ నిర్భర్ భారత్ లోగో’ తయారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు టీ షర్ట్స్, జీన్స్ ధరించడం నిషేధం