చరణ్ ఏంటీ సైలెన్స్ !

రామ్​చరణ్-కొరటాల శివ సినిమాపై కొద్దిరోజులుగా వార్త‌లు తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్​.. కొరటాలతోనే క‌లిసి ప‌నిచెయ్య‌బోతున్నాడ‌ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కోడై కూసింది.

చరణ్ ఏంటీ సైలెన్స్ !

Ram Charan Next Film : రామ్​చరణ్-కొరటాల శివ సినిమాపై కొద్దిరోజులుగా వార్త‌లు తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్​.. కొరటాలతోనే క‌లిసి ప‌నిచెయ్య‌బోతున్నాడ‌ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కోడై కూసింది. అయితే అనూహ్యంగా కొరటాలతో బ‌న్నీ త‌న‌​ 21వ చిత్రం చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. మరి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చెర్రీ ఎవరితో చేయబోతున్నాడనే విషయమై సస్పెన్స్ నెల‌కుంది.

వెంకీ కుడుముల, వంశీ పైడిపల్లి.. చరణ్​కు గతంలో సినిమాలు ఓకే చేయించుకున్నారు. దీంతో వీరిద్దరిలో చెర్రీ ఒకరికి ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సురేందర్ రెడ్డి కూడా చరణ్​తో సినిమా చేయడానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నార‌ట‌. అయితే వంశీ పైడిప‌ల్లి వ‌ద్ద లైన్ మాత్ర‌మే రెడీగా ఉంద‌ట‌. పూర్తి క‌థ సిద్ద‌మ‌వ్వాలంటే మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. చర‌ణ్..వీరిలో ఎవ‌ర్నైనా ఎన్న‌కుంటాడా, లేదా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మ‌రో ద‌ర్శ‌కుడిని తెర‌పైకి తెస్తారా వేచి చూడాలి.

 

Read More : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

Click on your DTH Provider to Add TV9 Telugu