దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !

మొన్నామ‌ధ్య ధ‌ర‌ పెరుగుద‌ల‌ను చూసి బంగారాన్ని ఇక సామాన్యుడు తాక‌డం క‌ష్ట‌మేనేమో అనిపించింది. అయితే అనూహ్యంగా గ‌త కొంత‌కాలం నుంచి బంగారం ధ‌ర మ‌ళ్లీ త‌గ్గుతూనే వ‌స్తుంది.

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !
Ram Naramaneni

|

Sep 04, 2020 | 8:52 AM

మొన్నామ‌ధ్య ధ‌ర‌ పెరుగుద‌ల‌ను చూసి బంగారాన్ని ఇక సామాన్యుడు తాక‌డం క‌ష్ట‌మేనేమో అనిపించింది. అయితే అనూహ్యంగా గ‌త కొంత‌కాలం నుంచి బంగారం ధ‌ర మ‌ళ్లీ త‌గ్గుతూనే వ‌స్తుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో బంగారం ధ‌ర పెరిగినా కూడా దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ధ‌ర‌లు డౌన్ ఫాల్‌లోనే ఉన్నాయి. ఇక లోకల్‌గా ప‌సిడి ధ‌ర త‌గ్గితే, వెండి కూడా అదే దారిలో ప‌య‌నించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర రూ.390 తగ్గింది. ఫ‌లితంగా 10 గ్రామ్స్‌ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,770కు ప‌డిపోయింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ గోల్డ్ ధ‌ర‌ బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.430 క్షీణించింది. దీంతో 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.53,200కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే రూట్‌లో పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,600 త‌గ్గింది. దీంతో ధర రూ.65,600కు ప‌డిపోయింది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు మెయిన్ రీజ‌న్‌గా చెప్పుకోవచ్చు.

ఇకపోతే పసిడి ధరను చాలా అంశాలు ప్ర‌భావితం చేస్తాయి. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Also Read : ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu