ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

ఎల్​ఓసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్​ పోలీస్​, శశస్త్ర సీమా బల్ సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​
Follow us

|

Updated on: Sep 04, 2020 | 7:07 AM

ఎల్​ఓసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్​ పోలీస్​, శశస్త్ర సీమా బల్ సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హోంమంత్రిత్వ శాఖ, ​​సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ ఉన్నతాధికారులు సంయుక్తంగా నిర్వహించిన హైలెవ‌ల్ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఎస్ఎస్​బీకి చెందిన పలు ఆర్మీ టీమ్స్‌ను అరుణాచల్​ ప్రదేశ్​, భారత్​-నేపాల్​ బోర్డ‌ర్ ఏరియాల‌కు తరలించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అత్యంత కీలక ప్రదేశాలుగా పరిగణిస్తున్న ఉత్తరాఖండ్​, సిక్కింలో భారత్-చైనా-టిబెట్​ కలిసే ట్రై-జంక్షన్​ బోర్డ‌ర్‌లో చైనా దూకుడు చ‌ర్య‌ల‌కు పూనుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హోం శాఖ‌కు స‌మాచారం అందింది. చైనా బోర్డ‌ర్స్‌లో పారా మిలటరీ దళాలు భద్రతను ప‌టిష్ఠం చేశాయి. అరుణాచల్​ ప్రదేశ్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, లద్దాఖ్​, సిక్కిం బోర్డ‌ర్స్‌లోనూ హైఅలర్ట్​ ప్రకటించారు. సిక్కిం, ఉత్తరాఖండ్ ట్రై-జంక్షన్​ ఏరియాల‌కు 80 సైనిక బలగాలను పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎల్​ఓసీ వెంబడి భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే లేహ్‌లో పర్యటిస్తున్నారు.

Also Read : నో హ్యాండ్ షేక్, ఓన్లీ నమస్తే, రష్యాలో రక్షణ మంత్రి

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి