BIG BREAKING : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. 2019లో ఆయన తిరుపతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నెలరోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరారు దుర్గాప్రసాద్‌. నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

BIG BREAKING : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత
Follow us

|

Updated on: Sep 16, 2020 | 6:59 PM

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. 2019లో ఆయన తిరుపతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నెలరోజుల క్రితం కరోనాతో ఎంపీ దుర్గాప్రసాద్ ఆస్పత్రిలో చేరారు‌. చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు. నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

బల్లి దుర్గాప్రసాద్‌ 28 ఏళ్ల వయసులో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 28 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన రికార్డు సృష్టించారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. గూడూరు నుంచి 1985-1989 , 1994 , 2009-14 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996లో మంత్రిగా కూడా పనిచేశారు.

బల్లి దుర్గాప్రసాద్‌ రాజకీయ ప్రస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. వెంకటగిరి రాజా సంస్థానంలో ఆయన డ్రైవర్‌గా కూడా పనిచేశారు. ఆ రోజుల్లో రాజాగారికి టిక్కెట్‌ ఇవ్వడానికి టీడీపీ నిర్ణయించగా తనకు అవసరం లేదన్న రాజావారు తన డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌కు టిక్కెట్‌ ఇప్పించారు.అప్పటినుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దుర్గాప్రసాద్‌.