కరోనాను జయించిన శ్రీవారి ఆలయ అర్చకులు..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు కరోనాపై విజయం సాధించారు. 17 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వస్తే..ఇవాళ 16 మంది అర్చకులను

  • Tv9 Telugu
  • Publish Date - 9:04 pm, Fri, 24 July 20
కరోనాను జయించిన శ్రీవారి ఆలయ అర్చకులు..

Tirumala temple priests: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు కరోనాపై విజయం సాధించారు. 17 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వస్తే..ఇవాళ 16 మంది అర్చకులను క్వారంటైన్ సెంటర్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఈ నెల 8న నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 4 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అర్చకులకు వైద్యులు సూచించారు. మరోవైపు శ్రీవారి ఆలయ పెద్ద జియ్యంగార్ల ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్చకులు ప్రస్తుతం కోలుకుంటున్నారు.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..