తిరుమల కాటేజీలో భారీ చోరీ

తిరుమలలో మరోసారి చోరి జరిగింది. సన్నిధానం గెస్ట్‌హౌస్‌లో ఉన్న రూమ్‌ నెం.47లోకి చొరబడ్డ దొంగలు.. తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు రూ.4లక్షల విలువైన ఆభరణాలు, రూ.20వేలు అపహరించారు. బాధితుడు విజయవాడకు చెందిన పుల్లయ్య కాగా.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు వారు చర్యలను ముమ్మరం చేశారు. కాగా తిరుమలలో భద్రత ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. […]

తిరుమల కాటేజీలో భారీ చోరీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2019 | 12:34 PM

తిరుమలలో మరోసారి చోరి జరిగింది. సన్నిధానం గెస్ట్‌హౌస్‌లో ఉన్న రూమ్‌ నెం.47లోకి చొరబడ్డ దొంగలు.. తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు రూ.4లక్షల విలువైన ఆభరణాలు, రూ.20వేలు అపహరించారు. బాధితుడు విజయవాడకు చెందిన పుల్లయ్య కాగా.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు వారు చర్యలను ముమ్మరం చేశారు.

కాగా తిరుమలలో భద్రత ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కాటేజీల దగ్గర కూడా ప్రత్యేక సిబ్బంది ఉంటారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇంత సెక్యురిటీ ఉన్నా.. దొంగతనాలు జరుగుతుండటంతో భక్తులు ఆందోళనకు గురౌతున్నారు. అయితే నెలరోజుల వ్యవధిలో చోరి జరగడం ఇది రెండోసారి. జూలై 3న మణిమంజరి అతిథి గృహంలో మంత్రి గౌతమ్ రెడ్డి బంధువులు బస చేసిన రూమ్‌లో పడ్డ దొంగలు.. 10 తులాల బంగారం, రూ.2లక్షలను అపహరించిన విషయం తెలిసిందే.