14 యేళ్లు చీకటి గదిలోనే.. : “మథనం” మూవీ టీజర్ రిలీజ్
గోల్కొండ హైస్కూల్ మూవీ ఫేం శ్రీనివాస్ సాయి హీరోగా నటించిన మథనం మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో భావనరావు హీరోయిన్ గా నటించారు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యా ప్రసాద్, అశోక్ ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దంపతులు టీజర్‌ని విడుదల చేశారు. ఒక […]
గోల్కొండ హైస్కూల్ మూవీ ఫేం శ్రీనివాస్ సాయి హీరోగా నటించిన మథనం మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో భావనరావు హీరోయిన్ గా నటించారు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యా ప్రసాద్, అశోక్ ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దంపతులు టీజర్‌ని విడుదల చేశారు. ఒక యువకుడు పద్నాలుగు సంవత్సరాలు చీకటి గదిలో ఉండి.. తన ప్రేమను కాపాడుకోవడం కోసం బయటికి వస్తాడు. తన మనసులో ఉన్న విషయాన్ని హీరోయిన్‌కి చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ సన్నివేశాలను టీజర్ లో హైలెట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.