Bose Jai Hind: సుభాష్‌ చంద్రబోస్‌ అందించిన ‘జైహింద్‌’ నినాదం వెనకుంది మన హైదరాబాదీ అనే విషయం మీకు తెలుసా..?

The Person Behind Jai Hind Slogan: భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి సరికొత్త పంథాను నేర్పించిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. పోరాటం ద్వారానే స్వాతంత్రం సాధ్యమవుతుందని నమ్మి, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించి...

Bose Jai Hind: సుభాష్‌ చంద్రబోస్‌ అందించిన 'జైహింద్‌' నినాదం వెనకుంది మన హైదరాబాదీ అనే విషయం మీకు తెలుసా..?
Follow us

|

Updated on: Jan 23, 2021 | 8:32 AM

The Person Behind Jai Hind Slogan: భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి సరికొత్త పంథాను నేర్పించిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. పోరాటం ద్వారానే స్వాతంత్రం సాధ్యమవుతుందని నమ్మి, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించి వీరోచితంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ జయంతి నేడు. భారత ప్రజల్లో స్వాతంత్ర జ్వాలని రగిలిస్తూ ‘జైహింద్‌’ నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అయితే ఈ నినాదం వెనక ఉన్న వ్యక్తి మన హైదరాబాదీనే అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు.? సుభాష్‌ ‌చంద్రబోస్‌ అం‌దించిన ‘జైహింద్‌’ ‌నినాదం వెనుక ఉంది హైదరాబాద్‌కు చెందిన అబిద్‌ ‌హసన్‌ ‌సాఫ్రాని. ఈయన ఇంజనీరింగ్‌ ‌చదువుకోసం జర్మనీ వెళ్లారు. అక్కడ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌ప్రసంగం విని ప్రభావితుడయ్యారు. ఇంజనీరింగ్‌ ‌పూర్తయ్యాక తాను కూడా పోరాటంలో భాగస్వామినవుతానని బోస్‌ని కోరారు. బోస్‌ ‌వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా ఉద్యమంలో చేరారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో కీలకంగా పనిచేశారు. అప్పట్లో భారతీయ సైనికులంతా పరస్పరం పలకరించుకోడానికి ‘నమస్తే, నమస్కార్‌, ‌రామ్‌ ‌రామ్‌, ‌సత్‌ ‌శ్రీ అకాల్‌, ‌సలాం వాలేకుం..’ అనే పదాలు వాడేవారు. వీటన్నిటికీ బదులు దేశభక్తిని చాటే ఒకే పదం ఉండాలని అందరూ భావించారు. అప్పుడు అబిద్‌ ‘‌జై హిందూస్తాన్‌’అని సూచించారు. ఆ తర్వాత దాన్ని కుదించి ‘జై హింద్‌’‌గా మార్చారు. ‘జై హింద్‌’‌నినాదం బోస్‌కు నచ్చడంతో వెంటనే ఆమోదించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అబిద్‌ ‌హసన్‌ ‌సాఫ్రాని భారత విదేశాంగ శాఖలో చేరారు. వివిధ దేశాల్లో సేవలు అందించిన తర్వాత 1969లో పదవీ విరమణ చేశారు. తిరిగి హైదరాబాద్‌ ‌వచ్చి స్థిరపడ్డారు. 1984లో మరణించారు. అబిద్‌ ‌హసన్‌ ‌సాఫ్రాని పేరులో ‘సాఫ్రాని’కి ఒక ప్రత్యేకత ఉంది.

Also Read: Parakram Diwas : ఇవాళ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన .. అసోంలో భూకేటాయింపు పత్రాలు పంపిణీ