నవ భారతానికి రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్: ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో ప్రతి పౌరుడికి మేలు చేకూర్చే బడ్జెట్ ‌ఇది అన్నారు ప్రధాని. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఈ బడ్జెట్ రూపొందించారని, నవభారతానికి ఇది రోడ్ మ్యాప్‌లా ఉపయోగపడనుందన్నారు ప్రధాని. ఈ బడ్జెట్‌తో మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా సరికొత్త అభివృద్ధిని దేశం చూడబోతుందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌తో పేదలకు మేలు, యువతకు లబ్ది చేకూరనున్నాయంటూ […]

నవ భారతానికి రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్: ప్రధాని మోదీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2019 | 5:10 PM

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో ప్రతి పౌరుడికి మేలు చేకూర్చే బడ్జెట్ ‌ఇది అన్నారు ప్రధాని. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఈ బడ్జెట్ రూపొందించారని, నవభారతానికి ఇది రోడ్ మ్యాప్‌లా ఉపయోగపడనుందన్నారు ప్రధాని. ఈ బడ్జెట్‌తో మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా సరికొత్త అభివృద్ధిని దేశం చూడబోతుందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌తో పేదలకు మేలు, యువతకు లబ్ది చేకూరనున్నాయంటూ వ్యాఖ్యానించారు.