ఏపీలో 32 మంది ఐఎఎస్ అధికారులు బదిలీ
32 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో గనులశాఖ కార్యదర్శిగా బి.రాంగోపాల్, పరిశ్రమలశాఖ హెచ్అండ్‌టీ విభాగం కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్, కాపు కార్పొరేషన్ ఎండిగా ఎం. హరిందిరా ప్రసాద్, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా పి. కోటేశ్వరరావు, యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌గా నాగ రాణి, సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్‌గా ఎం.హరినారాయణన్, దీంతోపాటు 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ […]
32 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో గనులశాఖ కార్యదర్శిగా బి.రాంగోపాల్, పరిశ్రమలశాఖ హెచ్అండ్‌టీ విభాగం కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్, కాపు కార్పొరేషన్ ఎండిగా ఎం. హరిందిరా ప్రసాద్, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా పి. కోటేశ్వరరావు, యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌గా నాగ రాణి, సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్‌గా ఎం.హరినారాయణన్, దీంతోపాటు 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ పర్యవేక్షణకు గాను పి.అరుణ్ బాబు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఎం. విజయ సునీత, సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్య వేణి, వీరితో పాటు ఉపాధి, శిక్షణ డైరెక్టర్ మహేష్ కుమార్ రావిరాలను రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీస్ అధికారుల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే..