థాయిలాండ్ లో కర్ఫ్యూను ఎత్తివేత..!
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తం వైరస్ తీవ్రత పెరుగుతున్నప్పటికీ థాయిలాండ్ లో గడిచిన 21 రోజుల్లో స్థానికంగా ఒక్క కేసు నమోదు కాలేదు. దీంతో దాదాపు మూడు నెలల అనంతరం కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు థాయ్ ప్రభుత్వం పేర్కొంది. సుమారు 13 మిలియన్ల జనాభా కలిగిన ఆ దేశంలో జనవరి 13న తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు 3,135 మంది వైరస్ బారినపడగా.. 58 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇతర దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లోకి పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక కొత్త కేసులు వెలుగు చూడకపోవడంతో లాక్ డౌన్ సడలింపులు చేస్తూ.. రెస్టారెంట్లు, మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.