ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..

ఏపీలో జూలై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండగా.. ఇందులో కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..
Follow us

|

Updated on: Jun 03, 2020 | 1:55 PM

ఏపీలో జూలై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండగా.. ఇందులో కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోనున్న జాగ్రత్తలపై పలు విషయాలను వెల్లడించారు.

విద్యార్థుల కోసం కంటైన్మెంట్ జోన్లు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 4,154 ఎగ్జామ్ సెంటర్లను గుర్తించామని ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్న ఆయన.. పరీక్షా కేంద్రాల్లో ప్రతీ గదికి కేవలం 10 నుంచి 12 మంది విద్యార్ధులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అంతేకాకుండా టెన్త్ స్టూడెంట్స్ కోసం 8 లక్షల మాస్కులను అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్లలో విద్యార్థులు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. అటు ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్న ఆయన.. రెసిడెన్షియల్ విద్యార్థులకు ఒక రోజు ముందుగా హాస్టల్ వసతిని కల్పించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!