AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కాగిత రహిత (ఈ-క్యాబినెట్) సమావేశం జులై 2న జరిగింది. డిజిటల్ పాలన దిశగా ఈ సమావేశం ఒక ముఖ్య అడుగు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, వీబీ-గ్రామ్ పథకం అమలు, వానాకాలం సాగు ప్రణాళికలు, ఉద్యోగుల బదిలీలు, సిగ్ హౌసింగ్ ప్రాజెక్టుపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు
Revanth Reddy Cabinet Meeti
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 3:23 PM

Share

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జులై 2) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ-క్యాబినెట్) సమావేశంగా దీనిని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై క్యాబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేశారు. ఇటీవల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది.

ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన తాజా పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, ప్రాజెక్టు పురోగతిపై మంత్రివర్గం కీలకంగా సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ-రామ్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలా లేదా అనే అంశంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలోని కొన్ని నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.

వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వైవిధ్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రతిపాదిత ఎస్ఐజీ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలు, డిజైన్లు, విధివిధానాలకు కూడా ఆమోదం తెలిపే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. డిజిటల్ పాలన దిశగా ప్రభుత్వం వేస్తున్న మరో అడుగుగా భావిస్తున్న ఈ తొలి ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక విధాన నిర్ణయాలు వెలువడే అవకాశంపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!