ప్రభాస్ భూవివాదం కేసులో హైకోర్ట్ కీల‌క తీర్పు…

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు సంబంధించిన స్థలం విషయమై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 2083 చదరపు గజాల ల్యాండ్ కి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ స‌ర్కార్ ను ఆదేశించింది. వివాదం స‌ర్దుమ‌ణిగేవ‌ర‌కు ఆ ప్లేస్ ను ప్రభాస్‌కు అప్పగించాల్సిన అవసరం లేదని.. అలాగే అక్కడ ఉన్న క‌ట్ట‌డాన్ని కూడా కూల్చేవేయొద్దని సూచించింది. ప్రభాస్‌ పిటిషన్‌పై కింది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్‌ ఆర్డర్‌ను ఎత్తివేయాలంటూ గ‌వర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను […]

ప్రభాస్ భూవివాదం కేసులో హైకోర్ట్ కీల‌క తీర్పు...
Follow us

|

Updated on: May 02, 2020 | 3:02 PM

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు సంబంధించిన స్థలం విషయమై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 2083 చదరపు గజాల ల్యాండ్ కి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ స‌ర్కార్ ను ఆదేశించింది. వివాదం స‌ర్దుమ‌ణిగేవ‌ర‌కు ఆ ప్లేస్ ను ప్రభాస్‌కు అప్పగించాల్సిన అవసరం లేదని.. అలాగే అక్కడ ఉన్న క‌ట్ట‌డాన్ని కూడా కూల్చేవేయొద్దని సూచించింది. ప్రభాస్‌ పిటిషన్‌పై కింది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్‌ ఆర్డర్‌ను ఎత్తివేయాలంటూ గ‌వర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వీలైనంత‌ త్వరగా పరిష్కరించాలని కింది కోర్టును..హైకోర్టు ఆదేశించింది.

అస‌లు ఏం జ‌రిగిందంటే..

రాయదుర్గం ద‌గ్గ‌ర్లోని పాన్ మక్త గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల 30 గుంటల ల్యాండ్ గ‌వ‌ర్న‌మెంట్ కే చెందుతుంద‌ని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని క‌ట్టడాలు తొలగించి ఆ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఏరియాలో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్ ఉండటంతో దాన్ని కూడా సీజ్‌ చేశారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై 2018లో న‌టుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.

కాగా రీసెంట్ గా ప్ర‌భాస్ కూకట్‌పల్లి 15వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇంజంక్షన్‌ ఆర్డర్ జారీ చేసింది. దీంతో ప్రభాస్‌ ఏప్రిల్‌ 3న ఆ బిల్డింగ్ తాళం తీయడానికి య‌త్నించారు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్‌ పోలీసులతో వెళ్లి భవనానికి మ‌ళ్లీ లాక్ వేశారు. ఇంజక్షన్ ఆర్డ‌ర్స్ తీసివేయాలంటూ రెవిన్యూ అధికారులు కింది కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే కింది కోర్టు విచారణ చేపట్టకపోవడంతో రెవెన్యూ అధికారులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆస్తి ప్రభాస్ ఆధీనంలో ఉండటం సరికాదని చెప్పింది. ఇరుపక్షాలు తమ వెర్ష‌న్స్ కింది కోర్టుకు చెప్పాలని, ఆ కోర్టు ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని పేర్కొంది.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!