ఢిల్లీ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా సాద్

ఢిల్లీ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా సాద్

దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమని భావిస్తున్న తబ్లీఘీ జమాత్ ఈవెంట్ ప్రధాన సూత్రధారి మౌలానా సాద్ కంధాల్వీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇప్పటివరకు ఆయనకు వారు నాలుగు సార్లు నోటీసులు పంపినా వాటికి సరైన సమాధానాలివ్వలేదట. ఆ సమాధానాలు పోలీసులకు సంతృప్తి  కలిగించలేదు.  మళ్ళీ ఉసూరుమంటూ అయిదో సారి నోటీసు జారీ చేసేందుకు వారు సిధ్ధపడుతున్నారు.   మర్కజ్ కు చెందిన వెబ్ సైట్…ఢిల్లీ మర్కజ్ డాట్ కామ్ పై […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 02, 2020 | 3:14 PM

దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమని భావిస్తున్న తబ్లీఘీ జమాత్ ఈవెంట్ ప్రధాన సూత్రధారి మౌలానా సాద్ కంధాల్వీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇప్పటివరకు ఆయనకు వారు నాలుగు సార్లు నోటీసులు పంపినా వాటికి సరైన సమాధానాలివ్వలేదట. ఆ సమాధానాలు పోలీసులకు సంతృప్తి  కలిగించలేదు.  మళ్ళీ ఉసూరుమంటూ అయిదో సారి నోటీసు జారీ చేసేందుకు వారు సిధ్ధపడుతున్నారు.   మర్కజ్ కు చెందిన వెబ్ సైట్…ఢిల్లీ మర్కజ్ డాట్ కామ్ పై అప్ లోడ్ చేసిన వీడియోలపై నాలుగో నోటీసులో వివరణ కోరగా ఆయన ఇఛ్చిన సమాధానాలు అస్తవ్యస్తంగా, అసంబధ్ధంగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పైగా మొదట పంపిన నోటీసులకు సాద్ సరిగా రెస్పాండ్ కాలేదని తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఈ మౌలానా కొడుకులను కూడా ఖాకీలు విచారిస్తున్నారు.

ఈ మౌలానా గారి కరోనా వైరస్ టెస్ట్ రిపోర్టును వారు ఓ ప్రభుత్వ ల్యాబ్ నుంచి కోరగా అది వారికి  ఇంకా అందలేదు. అయితే మౌలానా లాయర్ ఫజల్ ఆయూబ్ మాత్రం తన క్లయింటుకు సంబంధించిన రిపోర్టు ఓ ప్రయివేట్ ల్యాబ్ నుంచి అందిందని, దాన్ని ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి ఇచ్చామని చెబుతున్నాడు. (ఈ యవ్వారమంతా గందరగోళంగా ఉంది.) అటు-తబ్లీఘీ జమాత్ కి, గల్ఫ్ దేశాలకు మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయని కొన్ని బ్యాంకు ఖాతాల ద్వారా తెలిసినట్టు పోలీసులు ఈడీకి వెల్లడించారు. ఈ లావాదేవీలతో  మౌలానా సన్నిహితులకు ప్రమేయమున్నట్టు భావిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu