కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఫిర్యాదులు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న కొవిడ్ పరీక్షల నిర్వహణ బాగులేదని పేర్కొంది.

కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఫిర్యాదులు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
Follow us

|

Updated on: Nov 26, 2020 | 4:21 PM

తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కారణ నోటీసు జారీ చేసింది. రోజుకు 50 వేల కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కరోనాకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. అంతేకాదు ప్రైవేట్‌ ఆస్పత్రులపై కూడా చర్యలు తీసుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే 50 వేల కరోనా పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. దీంతో కోర్టు ధిక్కారణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశించింది.

కరోనా పరీక్షలపై మరోసారి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది హైకోర్టు . జీహెచ్‌ఎంసీలో మాస్కులు, భౌతికదూరం నిబంధనలు సరిగా అమలు కావడంలేదని పేర్కొంది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు కరోనా మరణాలపై ఆడిట్‌ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సూచించింది. కరోనాబాధితులకు ధైర్యమిచ్చేలా మానసికకేంద్రం ఏర్పాటుచేయాలి కోరింది. డిసెంబర్‌ 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చేనెల 17కు వాయిదా వేసింది హైకోర్టు.

Latest Articles
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
చీజ్ శాండ్‌విచ్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ వచ్చింది..రూ.50 లక్షలు!
చీజ్ శాండ్‌విచ్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ వచ్చింది..రూ.50 లక్షలు!