AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?

తెలంగాణలో సన్న బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం గరిష్ఠ రిటైల్ ధరలను ఖరారు చేసింది. బీపీటీ, కేఎన్‌ఎం బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రూ.79గా నిర్ణయించింది. ఈ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. దుకాణాల్లో ధరల పట్టిక ప్రదర్శన తప్పనిసరి చేసింది.

సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
Telangana Rice Prices
Shaik Madar Saheb
|

Updated on: Nov 01, 2026 | 8:20 AM

Share

హైదరాబాద్: తెలంగాణలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే.. నాణ్యమైన మేలు రకం సన్న బియ్యం కేజీ రూ.100 వరకు అమ్ముతున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయింది.. రాష్ట్రంలో సన్న బియ్యం ధరలను అడ్డగోలుగా పెంచుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న రైస్‌మిల్లర్లు, ట్రేడర్లపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపింది. వినియోగదారులకు విక్రయించే ఆరు రకాల సన్న బియ్యం గరిష్ఠ రిటైల్ ధరలను (Maximum Retail Prices) ఖరారు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణయించిన ధరల కంటే.. ఎక్కువ ధరలకు బియ్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది..

రకాల వారీగా ఖరారైన సన్న బియ్యం గరిష్ఠ ధరలు:

వినియోగదారులు కొనుగోలు చేసే వివిధ రకాల సన్న బియ్యం ధరలు కిలో చొప్పున ఈ విధంగా నిర్ణయించారు..

బీపీటీ (BPT) – కేఎన్‌ఎం (KNM): రూ. 66

తెలంగాణ సోనా (సోనా మసూరి) – ఆర్‌ఎన్‌ఆర్ (RNR): రూ. 74

హెచ్‌ఎంటీ (HMT) – జేఎస్‌ఆర్ (JSR): రూ. 79

ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలను ప్రతి దుకాణంలో విధిగా ప్రదర్శించాలని (Display) ట్రేడర్లకు స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది.

పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు, కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచనలతో డైరెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ ట్రేడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశంలోనే వరి సాగు, దిగుబడి, సేకరణలో ముందున్న తెలంగాణలో బియ్యం ధరలు అసాధారణంగా పెరగడం సరికాదని డైరెక్టర్ స్పష్టం చేశారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఎవరి మార్జిన్లు వారు చూసుకోవాలని, కానీ వినియోగదారులకు మాత్రం కచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని తేల్చిచెప్పారు.

ధరల నియంత్రణపై అధికారులు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్తాలపై ముద్రించిన బరువు కంటే తక్కువ బియ్యం తూగడం, ఎంఆర్‌పీ స్టిక్కర్లు మార్చి అక్రమంగా ధరలు వసూలు చేయడం వంటి మోసాలను అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం) తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act) కింద కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. మార్కెట్లో కృత్రిమ ధరల పెరుగుదలను అరికట్టేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. లైవ్ వీడియో