తెలంగాణ డిగ్రీ విద్యార్దులకు గమనిక..
తెలంగాణ డిగ్రీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ‘దోస్త్’కు సంబంధించిన రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు పూర్తయినట్లు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.
Telangana Dost: తెలంగాణ డిగ్రీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ‘దోస్త్’కు సంబంధించిన రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు పూర్తయినట్లు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. దాదాపుగా 65,719 డిగ్రీ సీట్లను రెండో విడతలో కేటాయించామని చెప్పిన ఆయన.. మొదట, రెండు విడతలు కలిపి మొత్తంగా 1,68,184 సీట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. సీట్లు పొందినవారు అక్టోబర్ 6వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. అలాగే ఈ నెల 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని.. ఇంకా 2,41,266 డిగ్రీ సీట్లు మిగిలి ఉన్నట్లు లింబాద్రి తెలిపారు.
Also Read:
ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!
మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!
ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..