ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..

సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. అక్టోబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే నేరుగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

  • Ravi Kiran
  • Publish Date - 1:53 pm, Wed, 30 September 20
November Pensions Distribution

YSR Pension Kanuka Arrangements: సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. అక్టోబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే నేరుగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.65 లక్షల మంది లబ్దిదారులకు 2.52 లక్షల మంది గ్రామ. వార్డు వాలంటీర్ల ద్వారా అందించనున్నామని తెలిపారు.’

ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,497 కోట్లను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే ఈ నెల కొత్తగా 34,907 మంది పెన్షన్ అందుకోనున్నారని చెప్పారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్‌లకు రూ. 8.52 కోట్లను విడుదల చేశామన్నారు. అటు ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పెన్షన్లు సైతం వాలంటీర్లే పంపిణీ చేస్తారని మంత్రి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 847 సైనిక సంక్షేమ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.42.35 లక్షలు విడుదల చేసిందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Also Read:

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..