Jagan on Development: 14 ఏళ్లలో ఏనాడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా..? జగన్ సూటి ప్రశ్న

ఏపీలో చేపడుతున్న విధానాలను దేశమంతా అనుసరిస్తుందని సీఎం జగన్ అన్నారు. మనస్సు పెట్టి తాము పరిపాలన చేస్తుండటమే దానికి కారణమని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో కొనసాగుతున్నామని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు.

Jagan on Development: 14 ఏళ్లలో ఏనాడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా..? జగన్ సూటి ప్రశ్న
Jagan On Development
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2024 | 9:17 PM

ఏపీలో చేపడుతున్న విధానాలను దేశమంతా అనుసరిస్తుందని సీఎం జగన్ అన్నారు. మనస్సు పెట్టి తాము పరిపాలన చేస్తుండటమే దానికి కారణమని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో కొనసాగుతున్నామని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలను వెల్లడించారు.

ఉచిత వైద్యం, వైద్య విద్యలో ప్రోత్సాహకంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం.. ఇది కాదా అభివృద్ధి? అని జగన్ ప్రశ్నించారు. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తున్నామన్నారు. క్వాలిటీ చదువులు అందించడం అభివృద్ధి కాదా..? బడికి వెళ్ళే పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా? అమ్మబడి పేరుతో పాఠశాలకు కొత్త రూపు తీసుకువచ్చామన్నారు. అలాగే ఇంటి వద్దకే పెన్షన్‌, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా” అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌ నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…