ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!

ఏపీ ప్రజలకు అలెర్ట్. అక్టోబర్ 1వ తేదీ నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

 • Ravi Kiran
 • Publish Date - 3:16 pm, Wed, 30 September 20

AP Special trains Halt stations: ఏపీ ప్రజలకు అలెర్ట్. అక్టోబర్ 1వ తేదీ నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రైళ్ల సర్వీసులు, వాటి హాల్టింగ్ స్టేషన్లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. కరోనా కారణంగా ఇండియన్ రైల్వేస్ ఇప్పటివరకు పరిమితి సంఖ్యలోనే రైళ్లు తిప్పుతూ వస్తోంది. రేపటి నుంచి రాష్ట్రంలో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకలు, ఆగే స్టేషన్ల వివరాలివే.

ఈ స్పెషల్ ట్రైన్స్ ఆ స్టేషన్లలో కూడా ఆగుతాయి..

 •  సికంద్రాబాద్-హౌరా(02702/04): పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట
 • సికంద్రాబాద్ – గుంటూరు(0702/01): నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి
 • విశాఖపట్నం – హైదరాబాద్(02727/28): తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, దువ్వాడ
 • సీఎస్‌టీ- భువనేశ్వర్(01019-20): తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి
 • నిజామాబాద్-తిరుపతి(02794/93): రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి
 • జైపూర్- మైసూర్(12976/75): కర్నూలు సిటీ, డోన్, ధర్మవరం
 • గోరకపూర్-యశ్వంత్ పూర్(12592/91): ధర్మవరం
 • ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- చాప్రా(12669/70): గూడూరు
 • ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – న్యూఢిల్లీ(02432/33): గూడూరు, చీరాల, తెనాలి

Also Read:

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..