రోహిత్ సేన ఆల్‌రౌండ్‌ షో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది.

రోహిత్ సేన ఆల్‌రౌండ్‌ షో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 01, 2020 | 11:31 PM

IPL 2020: ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(70; 45 బంతుల్లో 8×4, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు, చివర్లో పొలార్డ్(47 నాటౌట్‌; 20 బంతుల్లో 3×4, 4×6), హార్దిక్ (30 నాటౌట్‌; 11 బంతుల్లో 3×4, 2×6) మెరుపులు తోడవ్వడంతో మొదట ముంబై 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ విఫలమైంది. పాటిన్సన్(2/28), బుమ్రా (2/18), చాహర్(2/26) ధాటికి 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. రాహుల్(17), మయాంక్ అగర్వాల్(25) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. మాక్స్‌వెల్‌ మరోసారి విఫలమయ్యాడు. నికోలస్ పూరన్‌ (44; 27 బంతుల్లో 3×4, 2×6) టాప్‌ స్కోరర్‌.