అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు 18 కిలోల ఆడ కచిడి చేప చిక్కింది. ఇది రూ. 40,000కు నర్సాపురం చేపల వ్యాపారికి అమ్ముడుపోయింది. మగ కచిడి చేప లక్షల రూపాయలు పలకవచ్చని వ్యాపారులు తెలిపారు. చేప పొట్టలోని బ్లాడర్‌ను ఆపరేషన్లలో కుట్లు వేయడానికి ఉపయోగిస్తారని ఫిషరీస్ ఏడీ సిద్ధార్థ వర్ధన్ పేర్కొన్నారు.