‘డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలకు సర్వం సిద్దం’..
తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి వెల్లడించారు.
Telangana Degree And PG Exams: తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి వెల్లడించారు. ఇప్పుడు చివరి సంవత్సరం విద్యార్ధులకు మాత్రమే పరీక్షలు జరుగుతాయని చెప్పిన ఆయన.. అన్ని యూనివర్సిటీలు కలిపి సుమారు రెండు లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.
పరీక్షల నిర్వహణపై పాపిరెడ్డి మాట్లాడుతూ.. ”గతంలో ఒక రూమ్‌కు 40 మందిని కూర్చోపెట్టి పరీక్ష నిర్వహించేవాళ్లం. ఇప్పుడు కేవలం 20 మంది మాత్రమే కూర్చోపెడతాం. విద్యార్ధులు తమ చదివిన కాలేజీల్లోనే పరీక్ష రాయొచ్చు. ఇక పరీక్ష రాయలేని వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ నిర్వహిస్తాం. ఒకవేళ బ్యాక్ లాగ్స్ ఉంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు. కాగా, సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడిస్తామని.. ఇకపై ఐసీఎంఆర్, సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని పాపిరెడ్డి స్పష్టం చేశారు.