నిరుద్యోగులకు గుడ్ న్యూస్…తెలంగాణ ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీని అతి త్వరలోనే చేపట్టేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్...తెలంగాణ ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు..
Sanjay Kasula

| Edited By: uppula Raju

Dec 18, 2020 | 12:17 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీని అతి త్వరలోనే చేపట్టేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఛైర్మన్ ఘంటా చక్రపాణి, కమిషన్ సభ్యుల పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి సీఎస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సెల్‌.. టీఎస్‌పీఎస్‌సీతో సమన్వయం చేసుకుంటూ నియామక ప్రక్రియ చేపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 50వేల ఉద్యోగాల నియామకాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ఉన్నామని సీఎస్‌ వివరించారు.

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మర్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రాష్ట్రానికి సేవ చేసే అవకాశం రావడం సంతోషించదగిన విషయమన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నియామకాల్లో పారదర్శకంగా, నిజాయతీగా వ్యవహరించామని.. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. భర్తీ విషయంలో దేశం మొత్తం టీఎస్‌పీఎస్‌సీ వైపు చూసే విధంగా కమిషన్‌ను తీర్చిదిద్దామన్నారు. కమిషన్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 35 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ చేపట్టామని చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu